Meenakshi Chaudhary: డిసెంబర్ 4న ఓ ఇంటి వాడు కాబోతున్న నాగచైతన్య ఫిబ్రవరిలో ‘తండేల్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. చైతూ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రాబోతున్న చిత్రమిది. చందుమొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయిపల్లవ కథానాయిక గా నటించింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తిఅయింది. ఇప్పుడు తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు నాగచైతన్య. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహించే ఈ చిత్రం డిసెంబర్ 11న ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాలో చైతన్య సరసన హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘లక్కీ భాస్కర్’తో హిట్ కొట్టిన మీనాక్షి ఆ వెంటనే ‘మట్కా’తో డిజాస్టర్ ను ఫేస్ చేసింది.
Meenakshi Chaudhary: ఈ నెల 22న ‘మెకానిక్ రాకీ’తో మరో సారి ఆడియన్స్ ముందుకు రానుంది. అంతే కాదు నాగచైతన్య మామ వెంకటేశ్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’లో కీలక పాత్ర పోషిస్తోంది. నాగచైతన్య సినిమాలో పూజా హేగ్డే మరో హీరోయిన్ గా నటించనుంది. బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారట. ‘విరూపాక్ష’లాగే ఈ సినిమా కూడా థ్రిల్లర్ కథాంశంగా ఉంటుందట. మరి రాబోయే ‘తండేల్’తో పాటు ఈ సినిమాతో నాగచైతన్య ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో! లెట్స్ వెయిట్ అండ్ సీ.

