Meenakshi Chaudhary: టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరికి లక్కీ ఛాన్స్ కోటేసింది. ఆమెను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ పదవి ఇచ్చి గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరిని నియమిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. త్వరలో ఆమె రాష్ట్ర ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఏపీ రాష్ట్ర మహిళల కోసం పనిచేసే అవకాశం ఆమెకు దక్కింది.
Meenakshi Chaudhary: టాలీవుడ్‌లో వరుస హిట్ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి గుర్తింపును దక్కించుకున్నారు. తాజగా మీనాక్షి చౌదరి నటించిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్‌రాజు, వెంకీ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం.. సినిమా విజయాన్ని దక్కించుకున్నది. ఈ సినిమాలోని పాత్రతో సినీ ప్రేక్షకులకు ఆమె మరింత చేరువయ్యారు.
Meenakshi Chaudhary: నటి మీనాక్షి చౌదరి సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు.. అనే సినిమాలో హీరోయిన్‌గా ఆమె సినీరంగం ప్రవేశం చేశారు. ఆ తర్వాత రవితేజ సినిమా ఖిలాడీలో హీరోయిన్‌గా అవకాశం దక్కింది. హిట్ : 2 సెకండ్ కేసు అనే సినిమాలోనూ హీరోయిన్‌గా నటించి గుర్తింపు దక్కించుకున్నది. గుంటూరు కారం, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం, లక్కీ భాస్కర్ తదితర సినిమాల్లో వరుసగా నటించి మరింత గుర్తింపును తెచ్చుకున్నారు. ముఖ్యంగా లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇప్పుడు ఆమెను గుర్తించిన ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా పదవి ఇచ్చి మరింత గుర్తింపునిచ్చింది.