Jagtial

Jagtial: రోగుల ముందు ఈ నర్సులు చేసిన పని చూస్తే షాక్ అవుతారు..

Jagtial: ప్రభుత్వ ఆసుప్రతిలో నర్సులు మామూలుగానే  పేషెంట్ లని పట్టించుకోరు. పదే పదే అడిగితే తప్ప ఏ విషయానికి కైనా సమాధానం చెపుతారు. ఈ హాస్పిటల్ లో నర్సులు మాత్రం వాళ్ళు ఉన్నది హాస్పిటల్ అన్న విషయం కూడా మర్చిపోయి వాళ్ళు చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 

జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో నర్సులు పేషెంట్ లు ఉన్నారు అనే విషయం కూడా పాటించుకోకుండా పెద్దగా సౌండ్స్ పెట్టుకొని  ఆసుపత్రి గదిలో డాన్సులు చేశారు. దీనిపై రోగుల బంధువులు అసహనం వ్యక్తం చేశారు. ఏదో గొప్పపని చేసినట్టు  ఆ వీడియో ని సోషల్ మీడియా షేర్ చేశారు. ఆ వీడియో చుసిన నెటిజన్లు రోగుల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా సరదాగా గడిపేస్తున్న నర్సులపై విమర్శలు గురిపించారు.  

ఇది కూడా చదవండి: Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టును త‌ప్పుబ‌ట్టిన కాంగ్రెస్ ఎంపీ

Jagtial: క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేశారు. నర్సులు, వైద్య సిబ్బంది, కలిసి అసుపత్రి గదిలో డాన్స్ ప్రాక్టీస్ చేశారు ప్రక్కనున్న గదులలో‌ చికిత్స పొందుతున్న పేషెంట్స్ ఉన్నరన్న విషయాన్నీ మరిచి పోయారు.

డ్యూటిలో ఉన్న నర్సులు, వైద్య సిబ్బంది ఇలా డ్యాన్సులు చేయడంపై రోగుల తరుపున బంధువులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు… ఇలా చాలా సేపు వరకు పేషెంట్ లని పాటించుకోకుండా డాన్సులు చేయడంతో. పేషెంట్ తరపు బంధువులు హాస్పిటల్ అర్ఎంకి‌ ఫిర్యాధు చేశారు. అయితే ఆర్ఎం కూడా నర్సులు,సిబ్బంది క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కోసం డాన్స్ ప్రాక్టీసు చేస్తామని రిక్వెస్ట్ పెడితే తానే పర్మిషన్ ఇచ్చానని చెప్పుకొచ్చాడు.

ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాదికారులు సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ ఇవ్వాలి అని  ఆదేశించారు. అధికారులు ఆసుపత్రికి చేరుకుని రోగుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

[video_player file=”https://mahaanews.co.in/wp-content/uploads/2024/12/Nursing-staff-dance-in-Jagtial-hospital.mp4″]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *