Medaram Jatara 2026: మేడారం సమ్మక్క-సారలక్క మహాజాతరకు వెళ్లానుకుంటున్నారా? ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితంగా వెళ్లి రావాలని భావిస్తున్నారా? ఇతర వాహనాల కంటే తక్కువ చార్జీల్లో వెళ్లాలంటే ఏది బెస్ట్? అసలు చార్జీలు ఎంతెంత? అని తెలుసుకోవాలని భావిస్తున్నారా? తాజాగా టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసిన బస్సుల్లో చార్జీల వివరాలను ప్రకటించింది.
Medaram Jatara 2026: మేడారం ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి నడిపే ప్రత్యేక ఆర్టీసీ బస్సు చార్జీలను నిర్ధారిస్తూ టీజీఎస్ ఆర్టీసీ ఉత్తర్వులను జారీ చేసింది. వరంగల్, హనుమకొండ నగరాల నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సుల ఆధారంగా రూ.250 నుంచి రూ.500 వరకు చార్జీలు ఉన్నాయి. హైదరాబాద్ నగరం నుంచి మేడారానికి ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీ రూ.600గా నిర్ణయించింది. అదే సెమీ డీలక్స్ బస్సు చార్జీ అయితే రూ.650గా, డీలక్స్ రూ.680గా నిర్ణయించింది.
Medaram Jatara 2026: సూపర్ లగ్జరీ బస్సుల్లో అయితే హైదరాబాద్ నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సుల్లో రూ.770 చార్జీగా టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. అదే విధంగా రాజధాని బస్సులో రూ.960 ఉండగా, గరుడ ప్లస్ చార్జీ రూ.1,110గా నిర్ణయించింది. అదే విధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
