Medak Murder Case:ఇది మరో రకమైన హత్య. ఇటీవల ప్రేమ, వివాహా బంధాలు, వివాహేతర బంధాలు, ఆర్థిక బంధాల కారణంగా ఎందరో అయిన వారిని, పరాయి వారిని ఎందరో బలి తీసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇదే కోవలో జరిగినా ఇది మరో రకమైన హత్యగా చెప్పవచ్చు. మీ కూతురితో పెళ్లి చేయండి.. లేదంటే నును అన్నంత పనిచేస్తా.. అని బెదిరించిన యువకుడిని ఆ యువతి తల్లిదండ్రులే మట్టుబెట్టిన ఘటన ఇది.
Medak Murder Case:మెదక్ జిల్లా శివ్వంపేట మండలం మగ్దుంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతిని తాను ప్రేమించానని, తనతోనే వివాహం చేయాలని యువతి తల్లిదండ్రులకు హైదరాబాద్ బోరబండకు చెందిన యువకుడు మహ్మద్ సాబిల్ (21) ఫోన్ చేసి బెదిరించాడు. మీ కూతురితో పెళ్లి చేయకుంటే తనతో యువతి సాన్నిహితంగా ఉన్న ఫొటోలను, నగ్న ఫొటోలు బయటపెడతానంటూ యువతి అన్న అప్సర్‌ను బెదిరించాడు.
Medak Murder Case:ఫొటోలు డిలీట్ చేయాలని సాబిల్‌ను యువతి అన్న అప్సర్, ఇతర కుటుంబ సభ్యులు కోరారు. ఎన్నిసార్లు కోరినా వినకపోవడంతో ఓ ప్లాన్ చేశారు. అతనితో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. తాము అంగీకరించకపోతే తమ పరువు బజారుపాలవుతుందని భావించి బతిమిలాడుదామని భావించారు. పెళ్లి గురించి మాట్లాడుదామని ఓ చోటుకు రావాల్సిందిగా సాబిల్‌ను పిలిచారు.
Medak Murder Case:యువతి చెప్పిన చోటుకు సాబిల్ రానే వచ్చాడు. అక్కడ సాబిల్‌ను కారులో ఎక్కించుకొని మగ్దుంపూర్ గ్రామ శివారులోకి అప్సర్, సంతోష్ అనే వ్యక్తితో కలిసి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. అది ఘర్షణకు దారితీయడంతో సాబిల్ తలపై వారిద్దరూ బండరాయితో కొట్టి చంపేసి, మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు.
ఈ మేరకు ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అప్సర్, సంతోష్‌లను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.

