Medak: నిన్నటి నుంచి కురుస్తున్న అతిభారీ వర్షాలు మెదక్ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు తండాలు వరద నీటిలో మునిగిపోయాయి. రహదారులు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో రవాణా అంతరాయం ఏర్పడింది.
ప్రభావిత మండలాల
హవేలీ ఘనపూర్, రామాయంపేట, చేగుంట, నార్సింగి, మెదక్ పట్టణం, మాసాయిపేట మండలాల్లో విస్తృతంగా వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయ్యింది.
వాతావరణ విభాగం హెచ్చరిక
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, ఈ రాత్రి మరియు రేపు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోంది.
విద్యాసంస్థలకు సెలవు
జిల్లాలో పరిస్థితులు దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మరియు కాలేజీలకు రేపటికి సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి (డీఈవో) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
కామారెడ్డిలోనూ హాలిడే
భారీ వర్షాల ప్రభావంతో కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు కూడా రేపు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

