McGrath

McGrath: ఒత్తిడితో కోహ్లీ చిత్తు.. ఆసీస్ పేసర్లకు మెక్ గ్రాత్ సలహా

McGrath: కోహ్లీపై ఒత్తడి పెంచండి..అతని భావోద్వేగాలతో ఆడుకోండి అంటూ ఆసీస్ బౌలర్లకు  సలహాలు చెబుతున్నాడు దిగ్గజ పేసర్ మెక్ గ్రాత్.. అయితే కొన్ని సార్లు ఇలా రెచ్చగొడితే కోహ్లి మరింత దూకుడుగా చెలరేగిపోయే ప్రమాదం కూడా ఉంటుందని ఈ ఆసీస్‌ మాజీ పేసర్‌ చిన్న హెచ్చరిక కూడా జారీ చేశాడు. క్రీజులో కుదురుకోనీయకుండా తక్కువ స్కోర్లకే అతన్ని పెవిలియన్ చేర్చితే సిరీస్ అంతా అదే కొనసాగుతుందంటున్నాడు.

ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీకి అద్భుత రికార్డుంది. బౌన్సీ పిచ్ లపై కోహ్లీ  ఆడిన 13 టెస్టుల్లో ఏకంగా 54.08 సగటుతో 1352 పరుగులు చేసాడు. అందులో 6 సెంచరీలు ఉన్నాయి. కెప్టెన్ గా 2018–19లో తొలిసారి భారత జట్టుకు ఆ్రస్టేలియా గడ్డపై సిరీస్‌ అందించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. అందుకే ఫామ్ తో సంబంధం లేకుండా అతన్ని నిలువరిస్తే ఆసీస్ విజయం ఖాయమని ఆసీస్ మాజీ క్రికెటర్లు చెబుతున్నారు.  కోహ్లిపై ఒత్తిడి పెంచాలని, అతడి భావోద్వేగాలతో ఆడుకోవాలని దిగ్గజ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ తమ బౌలర్లకు చెబుతున్నాడు.

ఇది కూడా చదవండి: AUS vs IND: పెర్త్ టెస్టుకు బుమ్రా సారథ్యం..వన్ డౌన్ లో రాహుల్..

McGrath: సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన విషయం వారి మనసుల్లో తాజాగా ఉంటుందని ..ఇదే విషయాన్ని గుర్తు చేసేలా కోహ్లీ పై ఒత్తిడి పెంచేలా చేయాలని మెక్ గ్రాత్ అంటున్నాడు. ఓటమి బాధలో వారి సన్నాహకాలు అంతగా ఉండవు కాబట్టి టీమిండియాను దెబ్బ తీయాలంటే మొదట కోహ్లీ భావోద్వేగాలను నియంత్రించుకోకుండా దెబ్బ తీయాలి. ఎందుకంటే బాగా ఆడటం మొదలు పెడితే  కోహ్లీ అస్సలు ఆగిపోడు. ఒక వేళ విఫలమైతే మాత్రం అదే కొనసాగుతుందన్నాడు మెక్ గ్రాత్. . అంతేకాదు కోహ్లిని లక్ష్యంగా చేసుకొని ఆ్రస్టేలియా బౌలర్లు పదేపదే మాటల యుద్ధం చేస్తూ  అతనూ సిద్ధమైపోతాడు. అది ఒక్కోసారి  అతడి అత్యుత్తమ ఆటను కూడా బయటకు వస్తే అతన్ని ఆపడం కష్టమంటూ తమ దేశ బౌలర్లను హెచ్చరిస్తున్నాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *