Mazaka Paid Premieres

Mazaka Paid Premieres: మజాకా పెయిడ్ ప్రీమియర్స్.. ఒకరోజు ముందుగానే..!

Mazaka Paid Premieres: సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో ‘మజాకా’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్యమూవీస్ బ్యానర్‌ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది మజాకా. అయితే రిలీజ్ కంటే ముందు ఒక్కరోజు ఈ సినిమాకు పైడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్నీ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఎక్కడెక్కడ ఈ షోస్ ఉంటాయి అనేది మాత్రం వెల్లడించలేదు. ఈ సినిమా పట్ల చిత్ర హీరో సందీప్ కిషన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కెరీర్ లో హయ్యెస్ట్ వసూళ్లు రాబడుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. మరి ఈ సినిమా ముందు రోజు వేయనున్న ప్రీమియర్స్ తో హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబడుతుందో లేదో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  BJP: పవన్ ఖేరా కి రెండు ఓటర్ ఐడీలు.. ఓటు చోరి చేస్తున్న కాంగ్రెస్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *