Mazaka: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రీతూ వర్మ జంటగా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘మజాకా’. ఈ చిత్రంలో రావు రమేష్, ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు సాగర్ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో సోసోగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది.
జీ5 సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుని, మార్చి 28 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. థియేటర్లలో మిస్సయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, రాజేష్ దండ, ఉమేష్ కే ఆర్ బన్సల్ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు.
Also Read: Harish Shankar: హరీష్ శంకర్ కి వెంకీ మామ గ్రీన్ సిగ్నల్?
Mazaka: మురళీ శర్మ, హైపర్ ఆది లాంటి నటులు మరింత ఆకట్టుకునేలా చేశారు. అనీల్ సుంకర సమర్పణలో విడుదలైన ఈ సినిమా, కామెడీ, యాక్షన్ అంశాలతో కూడిన ఓ ఫన్ రైడ్‌ను అందించనుంది. ఓటీటీ ఆడియెన్స్‌కు ‘మజాకా’ ఓ మంచి ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశం ఉంది.