Mavoist: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులతో భద్రతా బలగాలు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
శనివారం ఉదయం బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టుల కదలికలపై ముందస్తు సమాచారం ఆధారంగా CRPF, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (DRG) బలగాలు కూంబింగ్ నిర్వహించగా, మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు సమర్థవంతంగా ప్రతిస్పందించడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా, వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర మావోయిస్టుల సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మృతుల శవాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుండగా, ఇంకా కొంతమంది మావోయిస్టులు అటవీ ప్రాంతంలో ఉన్నట్టు అనుమానంతో భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి. మావోయిస్టుల వ్యతిరేకంగా ఆపరేషన్‌లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
ఈ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు చొరబాట్లకు తగిన ఎదురుదెబ్బ ఇచ్చినట్లయ్యిందని భద్రతా వర్గాలు అభిప్రాయపడ్డాయి.