Massive Earthquake: బల్గేరియాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త నాడు చెప్పిన జోస్యం నేడు నిజమవుతుందా? మయన్మార్, థాయ్‌లాండ్ విలయమే అందుకు తార్కానాలా? భవిష్యత్తులో కూడా ఆమె చెప్పినట్టే విపత్తులు, జననష్టాలు జరగబోతున్నాయా? అంటే కొన్ని నిజమై కూర్చుంటున్నాయని విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. బాబా వంగా చెప్పినట్టుగా గతంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, వైరుధ్యాలు, అమెరికాలో ఆల్ ఖైదా 9/11 దాడులు నిజమయ్యాయి. ఆనాడే బాబా వంగా చెప్పినట్టుగా ప్రస్తుతం మయన్మార్, థాయ్‌లాండ్‌లో జరిగిన భూకంపాలు హాట్ టాపిక్‌గా మారాయి.
Massive Earthquake: బాబా వంగా తన భవిష్యవాణిలో ఆనాడు అసలేం చెప్పిందంటే? 2025వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సహజ విపత్తులు సంభవిస్తాయని చెప్పింది. భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు, వరదలు వంటి విపత్తులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను చిన్నాభిన్నం చేస్తాయని, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, జనాభా స్థాన భ్రంశం జరుగుతుందని చెప్పారు. అయితే ఆ భవిష్యవాణిలో మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంపాలు జరుగుతాయని నిర్ధిష్టంగా ప్రస్తావించకపోయినా, ఈ ప్రకృతి విలయం ఆమె చెప్పిన అంశాలేనని ఆమె అనుయాయులు చెప్తున్నారు.
Massive Earthquake: మార్చి 28న మయన్మార్‌లోని మాండలే సమీపంలో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం, థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఈ విపత్తులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్టు అంచనాలు అందుతున్నాయి. ఎందరో క్షతగాత్రులుగా మిగిలారు. మరెందరో నిరాశ్రయులయ్యారు. బ్యాంకాక్‌లో ఓ పెద్ద బిల్డింగ్ నేలమట్టం అయింది. ఈ భూకంపం గురించి బాబా వంగా స్పష్టంగా చెప్పకపోయినా, ఈ ఏడాది జరిగే విపత్తుల గురించి ముందే చెప్పారని ఆమె అనుయాయులు చెప్తున్నారు. ఆమె చెప్పినట్టుగానే ఇంకా ప్రపంచంలో భారీ విపత్తులు, జననష్టం జరిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.