Ravi Teja: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. ఆయన, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వస్తున్న #RT76 సినిమాకు సంబంధించిన టైటిల్, వీడియో గ్లింప్స్ ఈరోజు విడుదలైంది. ఈ చిత్రానికి మేకర్స్ ఖరారు చేసిన టైటిల్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ టైటిల్ వినగానే చాలా కొత్తగా, గమ్మత్తుగా అనిపించడంతో రవితేజ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Jana Nayagan: ఓవర్సీస్‌లో ‘జన నాయగన్’ రికార్డు బిజినెస్!
ఇటీవల వరుస పరాజయాలతో ఉన్న రవితేజ, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో తనకు అచ్చొచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్ కథను ఎంచుకున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. విడుదలైన గ్లింప్స్ వీడియోలో రవితేజ మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఆషికా రంగనాథ్ కథానాయికగా చేస్తుండగా, సోషల్ మీడియా సెన్సేషన్ అయిన డింపుల్ హయాతి కూడా రవితేజతో జత కట్టారు. గ్లింప్స్‌లో వీరితో రవితేజ చేసిన ఫన్, రొమాంటిక్ సన్నివేశాలు చాలా ఫ్రెష్ అనుభూతిని ఇస్తున్నాయి. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ కొత్త కాంబినేషన్‌లో వస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో రవితేజ కచ్చితంగా విజయం సాధిస్తాడో లేదో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
