Ma Inti Bangaram: ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మళ్లీ తెలుగు తెరపై ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోయిన్‌గా కనిపించబోతోంది. ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం నుంచి మాస్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రం ట్రైలర్ జనవరి 9న రానుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Hyderabad: హైకోర్టును ఆశ్రయించిన ‘రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ నిర్మాతలు
స్టార్ హీరోయిన్ సమంత, ఇటీవల వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. తెలుగులో శుభం సినిమాలో క్యామియో చేసిన ఆమె నుంచి, ఫుల్ లెంగ్త్ రోల్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మా ఇంటి బంగారం’ అనే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌ను, సమంత ఎప్పుడో ప్రారంభించినప్పటికీ అది ఆలస్యమైంది. ఇటీవల దర్శకురాలు నందిని రెడ్డితో మళ్లీ పట్టాలెక్కిన ఈ చిత్రం నుంచి, సమంత మాస్ లుక్ పోస్టర్‌తో సాలిడ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ పోస్టర్‌తో పాటు ట్రైలర్ జనవరి 9న విడుదలవుతుందని కన్ఫర్మ్ చేశారు. సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించిన ఈ చిత్రాన్ని, సమంతే నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ అప్‌డేట్‌తో సమంత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
