Mass Jathara: ధమాకా సినిమా తర్వాత మంచి హిట్ లేని రవితేజ.. తాజా సినిమా మాస్ జాతర తో ఈసారి హిట్ కొట్టబోతున్నం అని గట్టిగా చెప్పారు. అది కాకా ఇది రవితేజ 75వ చిత్రం కావడం విశేషం. విడుదల అయిన టీజర్, సాంగ్స్ లో వింటేజ్ రవి తేజ ని గుర్తుచేశారు డైరెక్టర్ భాను భోగవరపు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్.
ఈ సినిమాని నాగవంశీ మొదట ఆగస్టు 27న వినాయక చవితి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, మధ్యలో టాలీవుడ్ కార్మికుల స్ట్రైక్ జరగడం వాళ్ళ, షూటింగ్ వాయిదా పడింది. దింతో సినిమా రిలీజ్ డేట్ ని మార్చారు చిత్ర యూనిట్. ఇప్పుడు సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది అని ఇండస్ట్రీ లో టాక్ నడిచింది. కానీ ఇపుడు తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న చెక్కర్లు కొడుతున్న ఇంకో వార్త ఏంటిది అంటే ఇపుడు సెప్టెంబర్ లో రిలీజ్ కష్టమే అంటున్నారు.
విడుదల వాయిదా కొంతమంది అభిమానులను నిరాశపరిచినప్పటికీ, బజ్ మాత్రం తగ్గలేదు. వాస్తవానికి ఆలస్యం మరింత ఉత్కంఠను పెంచిందనే చెప్పాలి. రవితేజ రగ్డ్ లుక్, శ్రీలీల ఎనర్జీ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌లో కనిపించిన డైలాగులు, డ్యాన్స్ నంబర్లు, యాక్షన్ బ్లాక్‌లు చుస్తే ఇది పక్క మాస్ కమర్షియల్ బొమ్మ అనొచ్చు.
సోషల్ మీడియా లో వస్తున్న వార్తలకి చెక్ పెట్టాలి అంటే నిర్మాతలు ఆఫీసియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే కానీ వీటి చెక్ పడదు.
Ravi Teja కొత్త సినిమా #MassJathara
సెప్టెంబర్ లో రిలీజ్ కావడం కష్టమే అని ఇండస్ట్రీలో టాక్#Raviteja #NagaVamsi #MASSJatharaTeaser #MassJathara pic.twitter.com/EuavbkEbqL
— s5news (@s5newsoffical) August 23, 2025