Mass Jathara: మాస్ మహారాజా రవితేజ మరోసారి తన యాక్షన్ అవతారంతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన 75వ చిత్రం ‘మాస్ జాతర’ దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఓ పక్కా మాస్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో రవితేజ ఓ డైనమిక్ ఆర్పీఎఫ్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో ఫన్‌ఫుల్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ సినిమాపై హైప్‌ను రెట్టింపు చేశాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దాదాపు 20 కోట్ల భారీ ధరకు ఓటిటి హక్కులు అమ్ముడు పోయినట్లు సమాచారం. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
