Mass Jathara: మాస్ రాజా రవితేజ హీరోగా, యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా రూపొందుతున్న ‘మాస్ జాతర’ సినిమా సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. దర్శకుడు భాను బోగవరపు ఈ చిత్రాన్ని పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతూ మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ‘తూ మేరా లవర్’ అనే డైనమిక్ మాస్ నంబర్ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ పాట ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవితేజ, శ్రీలీల జోడీ డ్యాన్స్‌తో థియేటర్లలో జాతర వాతావరణం సృష్టించనుంది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి ఎనర్జిటిక్ ట్యూన్స్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలతో రూపొందుతోంది. రవితేజ మరోసారి తన మాస్ హవాతో బాక్సాఫీస్‌ను కుదిపేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా అభిమానులకు పూర్తి వినోద హంగామా అందించనుంది!
