The Raja Saab

The Raja Saab: ది రాజాసాబ్’ సీక్వెల్‌పై మారుతి స్పష్టత!

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న భారీ చిత్రం ‘ది రాజాసాబ్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. సినిమాకు సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్నలకు మారుతి క్లారిటీ ఇచ్చారు. “సినిమా పూర్తయ్యాక సీక్వెల్‌పై నిర్ణయిస్తాం. కథను బలవంతంగా సాగదీసి ప్రేక్షకులను నిరాశపరచను. మాకు పూర్తి స్పష్టత ఉంది,” అని మారుతి తెలిపారు. ఈ చిత్రం కోసం సాధారణ 8 గంటల షిఫ్ట్‌కు బదులు 18 గంటలు కష్టపడ్డామని, అందుకే అద్భుతమైన ఔట్‌పుట్ వచ్చిందని ఆయన చెప్పారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ హారర్ రొమాంటిక్ కామెడీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Karimnagar: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి గెలుపు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *