Marriage Stopped: ఇక్కడ రెండు మనసులు కలిశాయి. వేర్వేరు ఊర్లు అయినా ఇష్టపడ్డారు. ఇరుకుటుంబాలను ఆ ఇద్దరు తమ పెళ్లికి ఒప్పించారు. ఆ పెద్దలు కూడా ఆ రెండు మనసులను కలపాలని నిశ్చయించారు. ఉత్తచేతులతో కాకుండా ఎంతో కొంత తమ బిడ్డకు ముట్టజెప్పేందుకు ఆమె తల్లిదండ్రులు ఇష్టపడ్డారు. ఇక ఇరువర్గాల బంధువులతో కలిసి ఓ ఆలయంలో పెళ్లి జరిపించేందుకు చేరుకున్నారు. ఇక ముహూర్తం దగ్గర పడింది. అప్పుడే ఓ పేచీ పెట్టాడు వరుడు. అదేమిటో చూద్దాం రండి.
Marriage Stopped: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెండు వేర్వేరు గ్రామాలకు చెందిన యువతి, యువకుడు ఇష్టపడి, పెళ్లి చేసుకునేందుకు ఇరువరగ్ఆల పెద్దలనూ ఒప్పించారు. వరకట్నంగా కొంత నగదు, ఎకరం భూమి ఇస్తామని వధువు తల్లిదండ్రులు అంగీకరించారు. నగదులో కొంత ముందుగానే వరుడికి అందజేశారు.
Marriage Stopped: పొరుగున ఉన్న ఓ జిల్లాలోని ఒక ప్రముఖ ఆలయంలో రాత్రి పెళ్లి వేడుక ప్రారంభమైంది. అయితే జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో వరుడు తన డిమాండ్ల చిట్టా విప్పాడు. మిగతా నగదు, ఎకరం భూమి ఎప్పుడిస్తారో ఒప్పందపత్రం ముందుగానే రాసివ్వాలని పెద్దల ముందుంచాడు. అందరూ అవాక్కయ్యారు.
Marriage Stopped: తనను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడేమోనని నమ్మిన ఆ వధువు తన ఆస్తికోసం ఇష్టపడ్డాడని తెలిసి అవాక్కయింది. తన కూతురును ఇష్టపడ్డాడంటే నమ్మామని, తమ ఆస్తికోసమే ఈ తతంగమంతా చేస్తున్నట్టున్నదని గ్రహించారు ఆ వధువు తల్లిదండ్రులు. ఇదే సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. కట్నం డిమాండ్ చేయడం మోసమేనని వధువు బంధువులు ఆరోపించారు. దీంతో వివాహం నిలిచిపోయింది.