Marriage Days:

Marriage Days:ఏప్రిల్ 16 నుంచి క‌ల్యాణ ఘడియ‌లు.. మోగ‌నున్న పెళ్లి భాజాలు

Marriage Days: శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు.. క‌ల్యాణ‌మ‌స్తు.. అని పాడుకునే రోజులు రానే వ‌చ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వివాహాలు కుదిరిన కుటుంబాలకు శుభ ఘ‌డియ‌లు రానేవ‌చ్చాయి. దీంతో ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల్లోని ఉన్న శుభ ముహూర్తాల్లో వివాహాలు చేసుకోవచ్చ‌న్న‌మాట‌. వివాహ బంధంతో జంట‌లు త్వ‌ర‌లో ఒక్క‌ట‌య్యే అవ‌కాశం రానే వ‌చ్చింది.

Marriage Days: ఈ నెల (ఏప్రిల్‌) 16 నుంచి వ‌రుస‌గా శుభ ముహూర్తాలు జూన్ 8 వ‌ర‌కు ఉన్నాయి. ఆ త‌ర్వాతో మ‌రో రెండు మంచి రోజులు కూడా ఉన్నాయి. దీంతో ఆయా రోజుల్లో వ‌ధూవ‌రుల పేరు బలాలు, న‌క్ష‌త్ర జాత‌కాల‌తో వేద పండితులు పెళ్లి ముహూర్తాల‌ను నిర్ణ‌యించ‌నున్నారు. ఇప్ప‌టికే చాలా కుటుంబాల్లో అన్ని ఏర్పాట్లు చేసుకొని పెళ్లి ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వారికి శుభ ఘ‌డియ‌ల‌ను నిర్ణ‌యించ‌డ‌మే త‌రువాయి.

Marriage Days: ఒక్క పెళ్లి చేయాల‌నుకునే కుటుంబాల‌తో పాటు వివాహాల్లో ఉపాధి పొందే ఎంతో మంది కూడా ఈ శుభ ముహూర్తాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వేద పండితులు మొద‌లు, క్యాట‌రింగ్ సెక్ష‌న్ సిబ్బంది వ‌రకు ఎంతో కొంత ఉపాధి దొరుకుతుంద‌ని ఆశ‌తో ఎదురు చూస్తూ ఉన్నారు. వారంద‌రికీ ఈ వివాహ ఘ‌డియ‌ల్లో ఉపాధి దొరుకుతుంద‌ని భావించ‌వ‌చ్చు.

Marriage Days: ఇదిలా ఉండ‌గా, ఈ నెల (ఏప్రిల్‌) 30 అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా వేలాది పెళ్లిళ్లు జ‌రుగుతాయ‌ని పురోహితులు చెప్తున్నారు. జూన్ నెల 11 నుంచి జూలై 12 వ‌ర‌కు ఆషాఢ‌మాసం. ఈ నెల‌లో ముహూర్తాలు లేవు. మ‌ళ్లీ జూలై 25 నుంచి శ్రావ‌ణ‌మాసంలో మంచి రోజులు ఉన్నాయ‌న్న మాట‌.

శుభ ముహూర్తాలు ఇవే..
ఏప్రిల్ : 16, 18, 20, 21, 23, 30
మే : 1, 3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 19, 21, 23, 24, 30
జూన్ : 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో మంచి రోజులు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *