మావోయిస్టులకు మరో భారీ షాక్ తగిలింది.మావోయిస్టు మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో పనిచేసిన సుజాతను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో కలిపి సుజాత పై రూ.కోటికిపైగా రివార్డ్ ఉంది. కొత్తగూడెంలోని దవాఖానలో చికిత్స కోసం వెళ్తుండగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు.
కాగా, సుజాత బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. సుక్మా ప్రాంతంలో జరిగిన అనేక ఘటనల్లో ఆమె మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. వరుస ఎన్ కౌంటర్ లతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
ఈ నెలలోనే మావోయిస్టు పార్టీ సభ్యులు ఎన్ కౌంటర్ లో 31 మంది మృతి చెందారు. ఈ క్రమంలో మావోయిస్టు కీలక నేత అరెస్టు కావడం వారికి భారీ ఎదురు దెబ్బ అనే అంటున్నారు నిపుణులు.