Maoist party: నారాయణపూర్ జిల్లా, కుమ్మం ప్రాంతంలోని లకేవేద వద్ద డిసెంబర్ 11, 12 తేదీల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను బూటకమని ఆరోపించింది మావోయిస్టు పార్టీ. 7 మంది మృతుల్లో 5 మంది గ్రామస్థులే ఉన్నట్లు చెప్పారు. పోలీసుల విచక్షణారహిత కాల్పుల కారణంగా 3-4 గ్రామస్థులు మరణించగా, 7 మంది గాయపడ్డారని, వీరిలో మహిళలు కూడా ఉన్నారని తెలిపారు.
వారు చెప్పిన వివరాల ప్రకారం, 12వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో, కాగర్ దామన్ అభియాన్ కింద, సుమారు 4000 మంది పోలీసులతో సహా పారా మిలటరి సిబ్బంది ఇంద్రావతి ప్రాంతంలో దాడి చేశారు. ఈ దాడిలో, అనారోగ్యంతో బాధపడుతున్న వారి సహాయం కోసం వెళ్లిన కార్తీక్ అనే సీనియర్ మావోయిస్టు నేతను కూడా పట్టుకుని, కాల్చి చంపారు. ఈ ఘటనను తాము “బూటకా ఎన్‌కౌంటర్” అని అభివర్ణించి, పోలీసులపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు.