Maoist Party: మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకమని, పట్టుకొని కాల్చి చంపారని పెద్ద ఎత్తున మానవ హక్కుల సంఘాలు ఇప్పటివరకూ గగ్గోలు పెడుతూ వచ్చాయి. తాజాగా హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదని, పట్టుకొని కాల్చారని, మూడు రోజులపాటు చిత్రహింసలకు గురిచేశారని పేర్కొంటూ ఆ పార్టీ పేర్కొన్నది.
Maoist Party: మావోయిస్టు వికాల్స్ పేరుతో మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఆ లేఖను విడుదల చేసింది. విజయవాడలో వైద్య చికిత్స కోసం వచ్చిన హిడ్మాను భద్రతా దళాలు పట్టుకున్నాయని, మూడు రోజులపాటు చిత్రహింసలకు గురిచేశాయని ఆ పార్టీ ఆరోపించింది. ఆ తర్వాత మారేడుమిల్లి అడవులకు తీసుకెళ్లిన హిడ్మాను బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని ఆ లేఖలో ఆరోపించింది.
Maoist Party: హిడ్మా మరణం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో జరిగిన హత్య అని మావోయిస్టు పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ హత్యలకు మావోయిస్టు పార్టీ అగ్రనేత దేన్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతికి సంబంధం లేదని, ఆయన సమాచారం ఇచ్చాడన్నది అవాస్తవమని పేర్కొన్నది. దేవ్‌జీ, రాజారెడ్డి తమతోనే ఉన్నారని పేర్కొన్నది. కలప వ్యాపారులు ఇచ్చిన సమాచారంతోనే హిడ్మాను సజీవంగా పట్టుకున్నారని తెలిపింది.
