Manu Bhaker

Manu Bhaker: స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ఇండియా గా మనూ భాకర్..!

Manu Bhaker: ప్రఖ్యాత షూటర్ మనూ భాకర్‌కు బీబీసీ అవార్డు లభించింది. ఆమెను ‘స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ఇండియా’గా బీబీసీ సోమవారం ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె అద్భుతమైన ప్రదర్శన చేయడంతో ఈ అవార్డు సాధించింది. మనూతో కలిసి గోల్ఫర్ అదితి అశోక్, పారా షూటర్ అవని లెఖారా, టీమిండియా వైస్-కెప్టెన్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగట్ కూడా ఈ అవార్డుకు పోటీపడ్డారు.

అయితే, క్రీడా పాత్రికేయులు, రచయితల జ్యూరీ మనూ భాకర్‌ను ఎంపిక చేసింది. 22 ఏళ్ల భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ విభాగాలలో కాంస్య పతకాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. అలాగే, పారా ఆర్చర్ శీతల్ దేవి (బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్), భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (జీవిత సాధికారం), పారా షూటర్ అవని (పారా స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్) కూడా పురస్కారాలకు ఎంపికయ్యారు. తానియా సచ్‌దేవ్‌ను ‘చేంజ్‌ మేకర్’ అవార్డుతో బీబీసీ సత్కరించింది.

Also Read: Fastag Rules: ఈ రోజు నుండే అమలు కానున్న కొత్త ఫాస్ట్ ట్యాగ్ రూల్స్.. పాటించకపోతే..

భాకర్ ఒక సంవత్సరంలో రెండు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న మొదటి భారతీయ షూటర్‌గా అవతరించారు. ఆమెకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కూడా ఇదివరకే ప్రదానం చేయబడింది. భాకర్ భారతదేశంలోని ప్రముఖ క్రీడాకారుల స్థాయికి ఎదిగిన మనూ
భాకర్ ప్యారిస్ 2024లో సాధించిన విజయం భారత షూటింగ్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు.

మనూ మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం ఈవెంట్‌లోనూ, మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లోనూ కాంస్య పతకాలు గెలుచుకొని, భారతదేశానికి 12 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ షూటింగ్ లో పతకం సాధించి పెట్టింది. ఒత్తిడి నడుమ మనూ ప్రదర్శించిన ధైర్యం, స్థిరత్వం భారత ఒలింపిక్ చరిత్రలోని లెజెండ్స్ జాతిలో జాబితాలో ఆమెను చేర్చాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *