Manipur

Manipur: మణిపూర్‌లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడిగింపు

Manipur: మణిపూర్‌లో కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి పాలన గడువు జూలై 30, 2025తో ముగియనుండగా, ఇప్పుడు అది జనవరి 30, 2026 వరకు అమలులో ఉంటుంది. మణిపూర్‌లో గత ఏడాది కాలంగా తీవ్రమైన జాతి ఘర్షణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మే 2023లో ప్రారంభమైన ఈ హింస ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొల్పడానికి ఇంకా సమయం పడుతుందని కేంద్రం భావిస్తోంది.

Also Read: Rajasthan: పాఠశాలలో కూలిన పైకప్పు.. నలుగురు చిన్నారులు మృతి

రాష్ట్రంలో స్థిరమైన, సమర్థవంతమైన పాలనను నిర్ధారించడానికి రాష్ట్రపతి పాలన పొడిగింపు అవసరమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్రపతి పాలన పొడిగింపుతో, రాష్ట్ర పరిపాలన గవర్నర్ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. సాధారణ పరిస్థితులు తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మణిపూర్‌లో శాంతి స్థాపనకు, సాధారణ జనజీవనం పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *