Miss Universe India 2025: రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీలో మణికా విశ్వకర్మ విజేతగా నిలిచి, దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకోవడంతో, ఆమె ఈ ఏడాది చివరిలో థాయిలాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.
మణికా ప్రయాణం, ఆమె మాటల్లోనే..
రాజస్థాన్‌లోని గంగానగర్‌కు చెందిన మణికా ప్రస్తుతం ఢిల్లీలో మోడల్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఆమె మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 కిరీటాన్ని కూడా గెలుచుకున్నారు. ఈ విజయంపై ఆమె మాట్లాడుతూ, తన ప్రయాణం గంగానగర్ నుండి మొదలైందని, ఢిల్లీకి వచ్చి ఈ పోటీకి సిద్ధమయ్యానని తెలిపారు. “మనలో మనం ఆత్మవిశ్వాసం, ధైర్యం నింపుకోవాలి. ఈరోజు నన్ను సమర్థురాలిని చేసిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని ఆమె భావోద్వేగంతో పంచుకున్నారు.
జ్యూరీ సభ్యులు, విజేతల ప్రశంసలు
ఈ పోటీలో జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరించిన నటి ఊర్వశి రౌతేలా, మణికా విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. “పోటీ చాలా కఠినంగా ఉంది, కానీ విజేతను మనం ఎంచుకున్నాం. మణికా ఖచ్చితంగా మిస్ యూనివర్స్‌లో మనల్ని గర్వపడేలా చేస్తుంది” అని ఆమె తెలిపారు.
అలాగే, మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత రియా సింఘా కూడా మణికాను అభినందించారు. “50 మంది పోటీదారులతో పోటీపడి మణికా ఈ కిరీటాన్ని గెలుచుకుంది. ఇప్పుడు ఆమె థాయిలాండ్‌లో 130 దేశాల నుండి వచ్చిన వారికి పోటీ ఇవ్వనుంది.