Manickam Tagore:

Manickam Tagore: బీహార్ ఫ‌లితాల‌పై మాణిక్కం ఠాగూర్ ట్వీట్‌ సంచ‌ల‌న

Manickam Tagore: బీహార్ ఎన్నిక‌ల్లో ఎన్డీయే సంపూర్ణ ఆధిక్య‌త‌ను మించి స్థానాల్లో విజ‌య దుంధుభి మోగిస్తున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కూ సుమారు 170 స్థానాల‌కు పైగా ఆధిక్య‌త‌ను కొన‌సాగిస్తున్న‌ది. మ‌హాఘ‌ట్‌బంధ‌న్ కూట‌మి మాత్రం చ‌తికిల ప‌డింది. కేవ‌లం 66 స్థానాల్లో ఆధిక్య‌త‌లో ఉన్న‌ది. ఆ రాష్ట్రంలో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కేవ‌లం రెండు స్థానాల్లో ఇత‌రులు ఆధిక్య‌తలో ఉన్న‌రు.

Manickam Tagore: ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత మాణిక్కం ఠాగూర్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఎన్నిక‌లకు ముందు బీహార్ రాష్ట్ర‌వ్యాప్తంగా 65 లక్ష‌ల ఓట్ల‌ను తొల‌గించాక ఫ‌లితాల్లో ఇంకేం ఆశిస్తాం.. అందులోనూ ప్ర‌తిప‌క్షాల‌కు మ‌ద్ద‌తు ఇచ్చే ఓట‌ర్లే ఎక్కువ‌గా ఉన్నారు. అలాంట‌ప్పుడు ఫ‌లితాల రోజు ఇంత‌కంటే మించి ఆశించ‌లేము.. అని త‌న ట్వీట్లో పేర్కొన్నారు.

Manickam Tagore: ఇదిలా ఉండ‌గా, కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ ఓట్ చోరీ నినాదంతో దేశ‌వ్యాప్త ఉద్య‌మానికి శ్రీకారం చుట్టింది. బీహార్‌లో అధికార ఎన్డీయే కూట‌మితో ఎన్నిక‌ల సంఘం ఓట్ల‌ను పెద్ద ఎత్తున‌ తొల‌గించింద‌ని ఉద్య‌మ‌మే నిర్వ‌హించారు. ఈ అంశం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇప్పుడు ఆ పార్టీ నేత అదే అంశాన్ని తెర‌పైకి తేవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *