Mani Ratnam: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణ్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా క్రేజీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ నుంచి కొన్ని కారణాలతో తప్పుకోవడం ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై దిగ్గజ దర్శకుడు మణిరత్నం స్పందించడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. దీపికా నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఆమె కోరిన పని గంటలు, రెమ్యూనరేషన్‌పై ఎలాంటి తప్పూ లేదని మణిరత్నం స్పష్టం చేశారు. ఒక కళాకారిణిగా ఆమె హక్కులను గౌరవించాలని, ఆమె డిమాండ్స్‌లో అసమంజసం ఏమీ లేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వివాదం, మణిరత్నం స్పందన సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారాయి.
