Manchu Vishnu: పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇంకా సందీప్‌రెడ్డి వంగ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.. దింతో చిత్ర యూనిట్ సినిమాలో నటీనటులను ఎంపిక చేయడంలో బిజీ గా ఉన్నారు. దీనిలో భాగంగానే సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టారు.
సినిమాలో నటించాలి అని ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరు తమ ఆడిషన్ ఈవోచు అని కాస్టింగ్ కాల్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.. దింతో మంచు విష్ణు కూడా ఈ సినిమాలో నటించాలి అని అనుకుంటున్నారు. దీనికోసం ఆడిషన్ కి అప్లై చేసినట్టు స్వయంగా అతనే తెలిపారు. ‘నేను అప్లై చేసుకున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం!’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. ఇపుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి ఫన్నీ కామెంట్స్ నెటిజన్లు పెడుతున్నారు.
మంచు విష్ణు హీరో గా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ‘’కన్నప్ప’’ లో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు ప్రభాస్ సినిమాలో విష్ణు కి ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: బాలయ్య పై పవన్ అదిరిపోయే స్పీచ్ గూస్బూమ్స్ గ్యారంటీ
Yo! I applied. Now let’s wait and see 💪🏽🥰 https://t.co/PXNOPrl5aS
— Vishnu Manchu (@iVishnuManchu) February 15, 2025