Manchu family dispute:మంచు ఫ్యామిలీ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఇప్పటివరకూ మోహన్‌బాబు, ఆయన తనయులైన మంచు విష్ణు, మంచు మనోజ్ నడుమ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వివాదం రగులుతుండగా, ఇప్పటి వరకు ఈ వివాదంలో తలదూర్చని మోహన్‌బాబు సతీమణి నిర్మలా మోహన్‌బాబు ఎంటరయ్యారు. మంచు విష్ణుయే వివాదానికి కారకుడంటూ ఆయన సోదరుడైన మనోజ్ రగిలిపోతుండగా, నిర్మలా మోహన్‌బాబు మాత్రం విష్ణును వెనుకేసుకొస్తూ ఓ లేఖను విడుదల చేయడం కలకలం రేపుతున్నది.
Manchu family dispute:ప్రధానంగా మంచు మనోజ్ తన అన్న మంచు విష్ణుపై రెండు ప్రధాన ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఒకటి మంచు విష్ణు అనుచరులు తన ఇంటిలోనికి వచ్చి గొడవ చేశారని, సీసీ పుటేజీని తీసుకెళ్లారని ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేశారు. మళ్లీ తన తల్లి పుట్టినరోజును పురస్కరించుకొని వచ్చిన తన అన్న విష్ణు, ఆయన అనుచరులు జనరేటర్‌లో పంచదారను కలిపి విద్యుత్తు సరఫరా నిలిచిపోయేలా చేసి, తన కుటుంబ సభ్యులపై దాడి చేసేందుకు యత్నించారని మరో ఆరోపణ చేశారు.
Manchu family dispute:ముఖ్యంగా పైరెండు ప్రధాన ఆరోపణలపై నిర్మలా మోహన్‌బాబు స్పందిస్తూ ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖను ముగ్గురు పోలీసు అధికారులకు కూడా పంపారు. అయితే ఈ లేఖను ఇద్దరు సోదరుల మధ్య ఉన్న విభేదాలు సమసిపోవాలని ఆమె విడుదల చేసినట్టు తెలిసింది. అయితే ఈ లేఖను బట్టి మరింత ముదిరే అవకాశం కనిపిస్తున్నది. ఆమె లేఖలో పేర్కొన్న వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
Manchu family dispute:డిసెంబర్ 14న నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు అయిన విష్ణు మంచు జల్‌పల్లి ఇంటికి వచ్చి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. తన గదిలో ఉన్న సామాను తీసుకెళ్లాడు. ఈ ఇంటిలో మనోజ్‌కు ఎంత హక్కు ఉన్నదో, విష్ణుకు కూడా అంతే హక్కు ఉన్నది. విష్ణు తన మనుషులతో రానూ లేదు. ఎలాంటి గొడవ చేయలేదు. మనోజ్ పోలీస్ కంప్లయింట్ చేసిన దాంట్లో వాస్తవం లేదు. మా ఇంట్లో పనిచేయలేమని పనివాళ్లు కూడా మానేశారు.. అని తన లేఖలో నిర్మలా మోహన్‌బాబు పేర్కొన్నారు. మరి ఈ లేఖతో వివాదం సద్దుమణుగుతుందా? లేదో వేచి చూడాలి మరి.