Manasantha Nuvve

Manasantha Nuvve: ఉదయ్ కిరణ్ సినిమా రీ-రిలీజ్!

Manasantha Nuvve: టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ నటించిన కల్ట్ లవ్ స్టోరీ ‘మనసంతా నువ్వే’ మళ్లీ పెద్ద తెరపైకి రాబోతోంది. 2001లో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు 4కె, డాల్బీ అట్మాస్‌లో రీమాస్టర్ అయింది. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న రీ-రిలీజ్ కానుంది.

Also Read: Biker: శర్వానంద్‌ ‘బైకర్‌’ రిలీజ్‌ వాయిదా!

2001లో విడుదలై అప్పటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ‘మనసంతా నువ్వే’ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఉదయ్ కిరణ్, రీమా సేన్ జోడీగా నటించిన ఈ చిత్రానికి వి ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఆర్పీ పట్నాయక్ అందించిన చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఇప్పటికీ అభిమానులను వెంటాడుతూనే ఉంది. ఈ చిత్రాన్ని ఇప్పుడు 4కె రిమాస్టర్డ్ వర్షన్‌లో, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్‌తో అప్‌గ్రేడ్ చేశారు. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే అయిన ఫిబ్రవరి 14న ప్రేమికులకు కానుకగా మళ్లీ థియేటర్లలో ప్రదర్శింపబోతున్నట్లు నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ కల్ట్ లవ్ స్టోరీ మళ్లీ పెద్ద తెరపై ఎలాంటి స్పందన తెస్తుందో వేచి చూడాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *