Mahaa Conclave On Education: ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని తెలుసుకోవడం, పిల్లల చదువు ఎలా సాగుతుంది అన్నదాన్ని పరీక్షించడం కోసం “మనబడి” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని మహా న్యూస్ ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో, విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో పరిశీలిస్తున్నారు.
ప్రధాన లక్ష్యం – ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి
ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలపైనే దృష్టి సారించింది. విద్యా ప్రమాణాలు పెంచడం, పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడమే ఉద్దేశ్యం.
మహా ఎడ్యుకేషన్ కాంక్లేవ్
మహా న్యూస్ అన్ని జిల్లాల్లోని పాఠశాలల నుంచి ప్రత్యేక కథనాల తో పాటు ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి విద్యపై సమగ్ర అవగాహన పెంచే ప్రయత్నం జరుగుతోంది.
మంత్రి నారా లోకేశ్ తీసుకున్న కీలక చర్యలు:
-
డా. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం
ఈ పథకం ద్వారా పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్స్, షూస్, పుస్తకాలు ఉన్న పూర్తి స్కూల్ కిట్ లభిస్తోంది. -
పాఠ్య పుస్తకాల్లో మార్పులు
పిల్లల తిండికి నో బెరుకు ఉండకూడదనే ఉద్దేశంతో పాఠ్య పుస్తకాలను తేలికగా మార్చారు. ఇప్పుడు ఒక్క పుస్తకంలోనే ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయి. -
మధ్యాహ్న భోజన పథకం (డొక్కసీతమ్మ పథకం)
ఈ పథకం ద్వారా ప్రతిరోజూ రుచికరమైన నాణ్యమైన భోజనం, మెరుగైన బియ్యం, గుడ్లు అందిస్తున్నారు. -
ప్రాథమిక వసతుల అభివృద్ధి
ప్రభుత్వ పాఠశాలల్లో RO మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. -
డిజిటల్ తరగతులు & ద్విభాషా అవకాశం
పిల్లలకు డిజిటల్ తరగతుల సౌకర్యం కల్పిస్తున్నారు. తెలుగు లేదా ఇంగ్లీష్ మాధ్యమాన్ని వారు ఎంచుకోవచ్చు. -
తల్లి కి వందనం పథకం
ఈ పథకం ద్వారా పిల్లల తల్లిదండ్రులకు రూ.15,000 వరకూ సాయం అందిస్తున్నారు. పిల్లల సంఖ్యపై పరిమితం లేదు.
వాస్తవిక ఉదాహరణ – వడలంపేట ZP హై స్కూల్ (చిత్తూరు జిల్లా)
వడలంపేట జెడ్పీ హై స్కూల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ స్కీం (PM Shri Scheme) కింద ఎంపికైంది. ఈ స్కూల్ లో కేంద్ర ప్రభుత్వం నిధులతో మరమ్మతులు జరుగుతున్నాయి. స్కూల్ ను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు

