Mana Shankara Varaprasad Garu

Mana Shankara Varaprasad Garu: చిరు-వెంకీ మాస్ డ్యాన్స్‌తో అదిరిపోనున్న సంక్రాంతి ట్రీట్!

Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం నుంచి తాజా అప్‌డేట్ రిలీజ్ అయింది. విక్టరీ వెంకటేష్ క్యామియోలో కనిపించబోతున్న మాస్ సాంగ్ లిరికల్ వీడియో విడుదలైంది. ఇద్దరు స్టార్ల డ్యాన్స్ ప్రేక్షకులను అలరించనుంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం పట్ల అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ క్యామియో పాత్రలో కనిపించనున్నారు. ఇద్దరూ కలిసి ఓ మాస్ సాంగ్‌లో చిందులేస్తారని ఇప్పటికే తెలిసిందే. తాజాగా ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ బీట్ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. క్యాచీ లైన్స్‌తో ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది. థియేటర్లలో ఇద్దరు స్టార్ హీరోల డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనుంది. మెగా అభిమానులతోపాటు విక్టరీ ఫ్యాన్స్‌కు కూడా ఈ సాంగ్ ఫీస్ట్‌లా మారనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లలో పూనకాలు తెప్పించేందుకు సిద్ధమవుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *