Tirumala

Tirumala: తిరుమల దర్శనాల కోసం ఏకంగా హోమ్ మంత్రినే వాడేశాడు.. చివరికి ఏమైందంటే..

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం చాలామంది చాలారకాల ప్రయత్నాలు చేస్తారు. ఎక్కువగా రాజకీయ నాయకులు, మంత్రుల సిఫారసు లెటర్స్ కోసం ప్రయత్నాలు చేయడం సహజంగా జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అలా ప్రయత్నాలు చేసేవారిని మోసం చేయడానికి కొంతమంది రెడీగా ఉంటారు. ఎప్పటికప్పుడు ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. శ్రీవారి దర్శనం చేయిస్తానని చెప్పి వేలాది రూపాయలు కొట్టేసిన ఘనుల గురించి చాలాసార్లు విన్నాం. వింటూనే ఉన్నాం. ఇదిగో మళ్ళీ అలాంటి మోసగాడి గురించే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈకేసు కర్ణాటక నుంచి వచ్చింది. కర్ణాటక హోమ్ మంత్రి పేరు చెప్పి ఏపీ సీఎం ఆఫీసు అధికారులనే బోల్తా కొట్టించాడు ఈ ఘనుడు. పైగా ఏపీ అధికారులను ఉద్యోగాలు పీకేస్తానని బెదిరింపులు కూడా చేశాడు. కట్ చేస్తే ఇప్పుడు కటకటాల వెనుక ఉన్నాడు. ఇంతకీ ఏమైందంటే.. 

కర్ణాటకలో సివిల్ కాంట్రాక్టర్ గా ఉన్న మారుతి అనే వ్యక్తి తిరుపతి దర్శనానికి ఏర్పాట్లు చేస్తాను అంటూ ప్రజలకు టోపీ వేస్తూ వస్తున్నాడు. తానూ కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ అని చెబుతూ ఫోన్ చేసి ఏపీ అధికారులను బెదిరించి రికమండేషన్ లెటర్స్ తీసుకున్నాడు. ఇలా దర్శనానికి పంపిన భక్తులు ఒక్కోరి నుంచి 6-10 వేల రూపాయలు వసూలు చేశేవాడు. 

ఇది కూడా చదవండి: Punjab: పోలీస్ స్టేషన్ సమీపంలో బాంబు పేలుడు కలకలం

Tirumala: ఎలా దొరికాడంటే.. 

ఇటీవల కర్ణాటక నుంచి ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆనంద్ ఫోన్ చేశాడు. తాను కర్ణాటక హోమ్ మంత్రి పరమేశ్వర్  మాట్లాడుతున్నానని చెప్పాడు. తమ వాళ్లు ఆరుగురు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారనీ, వారికీ దర్శన ఏర్పాట్లు చేయాలనీ ఏపీ అధికారులను అడిగాడు. వారు అభ్యంతరం చెబితే.. మీ ఉద్యోగాలు తీయించేస్తా అంటూ బెదిరించాడు. దీంతో వీరు కర్ణాటక ప్రభుత్వ లెటర్ హెడ్ పై రిక్వస్ట్ పంపించామని కోరారు. అప్పుడు మారుతి ఒక లెటర్ హెడ్ పంపించాడు. ముందు అది నిజమైనదే అనుకున్నారు ఏపీ అధికారులు. కానీ, జాగ్రత్తగా పరిశీలించి చూడగా ఎక్కడో తేడా కొట్టినట్టు అనిపించింది. దీంతో ఏపీ అధికారులు కర్ణాటక హోమ్ షాహను సంప్రదించారు. ఆ లెటర్ హెడ్ ను వాళ్లకు పంపించారు. అది నకిలీదని కర్ణాటక అధికారులు నిర్ధారించారు. విషయం కర్ణాటక హోమ్ మంత్రి పరమేశ్వర్ దృష్టికి వెళ్ళింది. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ నాగన్నను ఆదేశించారు. దీంతో నాగన్న తుమకూరు నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు

స్పెషల్ నాగన్న ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి.. బెంగళూరులోని యలహంక న్యూటౌన్‌కు చెందిన నిందితుడు మారుతిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇలాంటి నేరాలు ఎన్ని చేశాడు అనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *