Viral News

Viral News: బిజినెస్ టూర్ అని చెప్పి ‘గర్ల్ ఫ్రెండ్ తో ‘ వేషాలు.. థాయ్‌లాండ్ వరదల్లో అడ్డంగా దొరికిపోయిన భర్త!

Viral News: ప్రకృతి వైపరీత్యాలు కేవలం ప్రాణాలు తీయడమే కాదు.. అబద్ధాల మీద బతికే మనుషుల ముసుగులను కూడా ఊడదీస్తుంటాయి. సరిగ్గా ఇదే జరిగింది ఓ ప్రబుద్ధుడి విషయంలో. కడుపుతో ఉన్న భార్యను వదిలి, ఆఫీస్ పని అని చెప్పి గాల్‌ఫ్రెండ్‌తో థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న అతగాడి గుట్టును ఊహించని విధంగా వరదలు రట్టు చేశాయి.

అసలేం జరిగింది?

మలేషియాకు చెందిన 45 ఏళ్ల ఒక వ్యక్తికి ఇప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని భార్య ఆ సమయంలో  గర్భవతి. ఆఫీస్ పని మీద వెళ్తున్నాను.. చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది” అని భార్యను నమ్మించి, తన ప్రియురాలితో కలిసి థాయ్‌లాండ్‌లోని ‘హాట్ యాయ్’ నగరానికి చెక్కేశాడు. అక్కడ గాల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నా, ఇంటి దగ్గర ఉన్న భార్యకు మాత్రం ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ, ఫోటోలు పంపిస్తూ తాను చాలా బిజీగా ఉన్నట్లు బిల్డప్ ఇచ్చాడు.

కథ అడ్డం తిరిగిందిలా..

అతగాడి ప్లాన్ అంతా పక్కాగా సాగుతున్న సమయంలో ప్రకృతి కన్నెర్ర చేసింది. థాయ్‌లాండ్‌లో కుండపోత వర్షాలు కురిసి, 12 ప్రావిన్సులు వరద ముంపునకు గురయ్యాయి. దాదాపు 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అప్పటివరకు విలాసవంతంగా సాగిన అతడి టూర్ ఒక్కసారిగా నరకప్రాయమైంది. వరదల కారణంగా తను ఉన్న హోటల్ చుట్టూ నీరు చేరడంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.

రెస్క్యూ ఆపరేషన్‌లో రచ్చ!

భర్త ఫోన్ కలవకపోవడం, అక్కడ వరదలు ఎక్కువగా ఉండటంతో భార్య ఆందోళన చెందింది. సోషల్ మీడియాలో వరద సహాయక చర్యల గురించి అప్‌డేట్స్ ఇస్తున్న ఒక మహిళను సంప్రదించి.. “నా భర్త ఫలానా హోటల్‌లో ఉన్నాడు, దయచేసి అతడిని కాపాడండి” అని ప్రాధేయపడింది. తన భర్త సహోద్యోగులతో కలిసి అక్కడ చిక్కుకుపోయాడని ఆమె నమ్మింది.

ఇది కూడా చదవండి: Tragedy Love Story: ప్రేమించి పెళ్లి చేసుకుంటే ప్రాణం తీశారు.. తాండూరులో నవవధువు అనుమానాస్పద మృతి!

కానీ, రెస్క్యూ టీమ్ ఆ హోటల్ గదికి వెళ్లేసరికి సీన్ రివర్స్ అయింది. మనోడు అక్కడ సహోద్యోగులతో కాదు.. తన ప్రియురాలితో కలిసి ఏకాంతంగా గడుపుతున్నాడు. గడచిన నాలుగు రోజులుగా వారు ఒకే గదిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ నిజాన్ని చూసిన రెస్క్యూ టీమ్ సభ్యురాలు షాక్ కు గురైంది.

భార్యకు చెప్పాలా? వద్దా?

భర్త బాగోతాన్ని చూసిన ఆ స్వచ్ఛంద కార్యకర్త ఒక సందిగ్ధంలో పడింది. సదరు భార్య గర్భవతి కావడం, ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉండటంతో.. నిజం తెలిస్తే ఆమె ఆరోగ్యం దెబ్బతింటుందని భావించి ఆ విషయాన్ని దాచిపెట్టింది. కానీ, లోకంలోని భార్యలను అప్రమత్తం చేయడానికి సోషల్ మీడియాలో ఈ ఉదంతాన్ని పోస్ట్ చేసింది.

మీ భర్తలను గుడ్డిగా నమ్మకండి. బయటకు వెళ్తున్నామంటే ఒకటికి రెండుసార్లు ఆరా తీయండి అంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

నెటిజన్ల రియాక్షన్:

ఈ విషయం తెలిసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వారికి వరదలు కాదు.. సునామీ వచ్చినా తప్పు లేదు అని కొందరు మండిపడుతుంటే..

పాపం.. బిజినెస్ ట్రిప్ అని వెళ్ళి లవర్‌తో అల్లాడిపోతున్నాడమ్మ అని గతంలో సమీరా భరద్వాజ్ చేసిన వీడియోను గుర్తుచేస్తూ సెటైర్లు వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *