Ex Deputy CM: ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి పూర్వ ఉప ముఖ్యమంత్రి టి.ఎస్. సింగ్‌దేవ్ నివాసమైన ప్యాలెస్‌లో విలువైన పురాతన వస్తువు దొంగిలించబడింది.
ఈ దొంగతనం ఆగస్టు 3వ తేదీ రాత్రి జరిగింది. సింగ్‌దేవ్ అప్పటికి విదేశీ పర్యటనలో ఉండటంతో, ఇంట్లో ఎవరూ లేరు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఒక గుర్తు తెలియని వ్యక్తి రాజభవనం పక్కన ఉన్న “కోతిఘర్” లోకి వెనుకవైపు నుంచి చొరబడి, రెండు ఇత్తడి ఏనుగు విగ్రహాలను దొంగిలించాడు.
ఈ విగ్రహాలు అత్యంత విలువైన పురాతన కళాఖండాలు. వాటిలో ఒకటి మాత్రమే బయట కనిపించింది, మిగతావి మాయం అయ్యాయి. దొంగిలించిన విగ్రహాల బరువు సుమారు 15 కిలోలు ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: Trump-Putin: యుద్ధం ఆపడమే లక్ష్యం.. పుతిన్ తో ట్రంప్ భేటీ
ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. సీసీటీవీలో దొంగ గోడ దూకి లోపలికి ప్రవేశించిన వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్యాలెస్ మేనేజర్ రాజ్ సోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సర్గుజా పోలీసులు బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.
సర్గుజా ఎస్పీ అమోలక్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ – “ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటున్నాం. ప్యాలెస్ చుట్టూ ఉన్న అన్ని కెమెరాలను పరిశీలిస్తున్నాం. దొంగ ఇంటి నిర్మాణాన్ని బాగా తెలిసిన వ్యక్తిగా అనుమానం ఉంది” అని తెలిపారు.
ఈ ఘటన రాజవంశానికి చెందిన ప్రాంతంలో జరిగినందున ప్రజల్లో ఆందోళన నెలకొంది. దొంగను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
