Tolichowki Murder

Tolichowki Murder: అక్రమ సంబంధం పెట్టుకుంది ఒక్కరు..హత్యకు గురైంది ఒక్కరు

Tolichowki Murder: తెలంగాణాలో కొంతకాలంగా హత్యలు జరుతున్నాయి వారానికి ఒక్కటి లేదా రెండు జరగడం కాయం. తాజాగా హైదరాబాద్ లోని టోలిచౌకిలో 24ఏళ్ల ఇర్ఫాన్ ని హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. హంతకుడు బిలాల్ భార్యతో ఇర్ఫాన్ తమ్ముడు అద్నాన్‌కి అక్రమసంబంధం ఉండటంతో ఈ హత్య జరిగినట్టు తెలుస్తుంది. బిలాల్, అద్నాన్ మధ్య ఈ విషయంపై గొడవ జరుగుతున్నట్టు తెలియడంతో ఇర్ఫాన్ అక్కడికి వేలాడు. ఈ గొడవలో ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో ఇర్ఫాన్‌పై బిలాల్ కత్తితో దాడి చేశాడు వెంటనే ఇర్ఫాన్‌ని హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

వివరాల్లోకి వెళ్తే.. 

టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారామౌంట్ కాలనీ నెంబర్ 4, మర్వ వద్ద ఆదివారం ఈ హత్య జరిగింది. కొంతకాలంగా మృతుడి తమ్ముడు అద్నాన్‌కి బిలాల్(హంతకుడి) భార్యకి మధ్య అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం పై మాట్లాడానికి అద్నాన్ దగ్గరికి వేలాడు బిలాల్. కొంతసేపు ఇద్దరిమధ్య ఈ విషయంపై మాట్లాడుకున్నారు ఇద్దరిమధ్య ఏమైదో తెలియదుగాని కొట్లాడుకోవడం మొదలుపెట్టారు తమ్ముడిని కొడుతున్నారు అనే విషయం తెలియంతో అక్కడికి ఇర్ఫాన్ వచ్చాడు. అక్కడ జరుగుతున్న గొడవని ఆపడానికి ప్రయత్నించాడు కానీ కుదరలేదు.

ఇది కూడా చదవండి: Shubman Gill: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు..

గొడవ మధ్యలో వచ్చిన ఇర్ఫాన్‌పై బిలాల్ కత్తితో ఛాతి పైన దాడి చేశాడు. ఇర్ఫాన్‌ని పక్కనే ఉన్న ఆపిల్ హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు, అద్నాన్‌కి దాడిలో త్రీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు బిలాల్‌ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొడవ మధ్యలో ఇర్ఫాన్ రావడం వల్లే అతని హత్య చేసినట్టు విచారణలో తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసి గొడవకి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *