Viral News

Viral News: ఎవడయ్య వీడు.. ఏకంగా పులికి బీర్ తాగించాడు..వైరల్ వీడియో

Viral News: మద్యం మత్తులో మనిషి ఏం చేస్తాడో చెప్పడం కష్టం. మధ్యప్రదేశ్‌లోని పెంచ్ నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఒక విచిత్రమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి ఏకంగా పులికి బీర్ తాగించడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

ఈ ఘటన అక్టోబర్ 4, 2025 తెల్లవారుజామున 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజు పటేల్ అనే వ్యక్తి ఫుల్‌గా మద్యం తాగి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలో అతనికి అకస్మాత్తుగా ఒక పులి ఎదురైంది.

మద్యం మత్తులో ఉన్న రాజుకు ఆ భయంకరమైన పులి, భయంకరమైన జంతువులా కాకుండా, పెద్ద పిల్లిలా కనిపించింది. “తాగితే పులి లేదు ఏమి లేదు” అన్న విధంగా అతను ఏమాత్రం భయపడలేదు.

ఇది కూడా చదవండి: Karur Stampede: నాకు డబ్బు ముఖ్యం కాదు.. విజయ్ కి రూ.20 లక్షలు వెనక్కి ఇచ్చేసిన బాధితురాలు

రాజు పటేల్ తాను తాగుతున్న బీర్ బాటిల్‌లో కొంత మిగిలిన మొత్తాన్ని పులికి ఆఫర్ చేశాడు. ఎంతసేపు ప్రయత్నించినా పులి బీర్ తాగకపోయేసరికి, రాజు పటేల్ నిరాశ చెందాడు. అయితే, పులి కూడా మనిషి జోలికి రాకుండా, రాజు పటేల్ జోలికి పోకుండా, ఎవరి దారిన వారు వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది.

పెంచ్ నేషనల్ పార్క్ అధికారులు సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా ఈ విచిత్రమైన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఈ దృశ్యాలు చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో అత్యంత ప్రమాదకరమైన జంతువు వద్దకు వెళ్లి దానితో సరదాగా ప్రవర్తించడం చాలా పెద్ద రిస్క్ అని, ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని పార్క్ అధికారులు హెచ్చరించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *