Crime News: కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయమై పెళ్లి చేసుకున్న జంట.. కేవలం ఐదు నెలలకే తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. దాంపత్య సమస్యలు, అదనపు కట్నం వేధింపులే ఈ దారుణానికి దారి తీసినట్లు పోలీసులు తెలిపారు.
వైవాహిక జీవితంలో నెల రోజుల్లోనే సంక్షోభం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవీన్, నేత్రావతికి మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇరు కుటుంబాలు మాట్లాడుకుని కట్న కానుకల వ్యవహారం చూసుకుని వివాహం చేశారు. అయితే, పెళ్లి జరిగిన నాటి నుంచే వారి దాంపత్య జీవితంలో సమస్యలు మొదలయ్యాయి.
ఇది కూడా చదవండి: Traffic Restrictions: రేపు ఏపీకి మోడీ.. 5 గంటల పాటు ఈ రూట్లు బంద్
పెళ్లయినప్పటికీ, శారీరకంగా కలిసేందుకు నేత్రావతి నిరాకరించడం ఈ గొడవలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కేవలం పదిహేను రోజుల్లోనే భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో నేత్రావతి తన పుట్టింటికి వెళ్లిపోయింది.
కేసుల పరంపర.. ద్వేషంగా మారిన కోపం
పుట్టింటికి వెళ్లిన నేత్రావతి అక్కడితో ఆగకుండా భర్త నవీన్, అతని కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆమె ఆరోపించడంతో, నవీన్‌కు తన భార్యపై ద్వేషం మరింత పెరిగింది.
భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు పలుమార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో, నేత్రావతి నవీన్‌కు విడాకుల నోటీసులు కూడా పంపింది. దీంతో నవీన్ కోపం పీక్స్ కు చేరింది.
భార్య తల్లి ఇంటికి వెళ్లి హత్య
భార్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నవీన్ ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. నేత్రావతి తల్లి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, ఆదివారం అర్ధరాత్రి నేరుగా అక్కడికి వెళ్లాడు. అక్కడ నేత్రావతిని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో నేత్రావతి కుప్పకూలిపోయింది.
ఇది కూడా చదవండి: Kiara Advani: కియారా కెరీర్‌కు కొత్త ట్విస్ట్! ‘వార్ 2’ ఫ్లాప్‌తో షాక్
హత్య జరిగిన వెంటనే అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆలస్యం కావడంతో నేత్రావతి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకున్న చిక్‌మగళూరు పోలీసులు నిందితుడు నవీన్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన ఐదు నెలలకే ఓ వైవాహిక బంధం ఈ విధంగా విషాదాంతం కావడం స్థానికంగా కలకలం సృష్టించింది.