Chittoor District: తాగుతాయా…తిరుగుట. నీకెందుకు…నోరుమూసుకుని డబ్బులు ఇవ్వు. ఇస్తావా లేదా..రోజు ఇస్తున్నా..ఈ రోజు లేవు అనేసరికి …ఆ పనికిమాలిన ఎదవ కోపంతో ఊగిపోయాడు . నాకే ఎదురు చెబుతావా ? చూస్తా ని అంతు చూస్తా అని …చేత్తో రాడ్డు తీసుకున్నాడు. చంపేశాడు. కట్టుకున్న పెళ్ళాన్ని ముందుకు డబ్బు ఇవ్వలేదని..బాది బాది చంపేశాడు.
తాగుడుకు బానిస అయిన ఓ భర్త కసాయిగా మారాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వనందుకు భార్యను హతమార్చాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం మాదన్నపల్లిలో చోటుచేసుకుంది.
Also Read: RC 16: RC 16 లో గేమ్ చేంజర్ లాంటి ఫ్లాష్ బ్యాక్!
మద్యానికి బానిసగా మారిన భర్త మునుస్వామి రోజు భార్య దగ్గర డబ్బులు ఇవ్వమని గొడవ పడేవాడు. ఇదే క్రమంలో ఓ రోజు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అందుకు మంగమ్మ నిరాకరించటంతో గొడవ పడి బయటకు వెళ్లాడు. మళ్లీ ఇంటికి వచ్చిన భర్త ఆవేశానికి గురై భార్య మంగమ్మను ఇనుపరాడ్‌తో కొట్టి చంపాడు.
దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.