Warangal: టెర్రస్ పైన పూల మొక్కలు పండ్ల మొక్కలు ఎవరైనా పెంచుతారు కానీ గంజాయి మొక్క పెంచే వాడికి ఉంటది అనుకున్నాడు ఓ వ్యక్తి. అక్కడ ఇక్కడ అడవుల పొంటి పోయి ఫారెస్ట్ ఆఫీసర్లకు కన్న కాడకుండా ఎంత తెస్తామనుకున్నాడో ఏంటో కానీ ఇంట్లోనే దుకాణం పెట్టేసాడు. మూడో కంటికి తెలియకుండా పెంచుతున్న ఆ గంజాయిని యాంటీ డ్రగ్స్ టీం జాగిలాలు పసిగట్టాయి.. ఇంకేముంది అడ్డంగా బుక్కై కటకటాల పాలయ్యారు. వివరాల్లోకెళ్తే
వరంగల్‌లోని శివనగర్ లో పల్లెబోయిన కుమార్ అనేవ్యక్తి మేడ పైన గంజాయి సాగు చేస్తున్నాడనే సమాచారంతో యాంటీ డ్రగ్స్ టీమ్ దాడులు నిర్వహించారు. మత్తు పదార్థాలను పసిగట్టే జాగిలాలతో మేడపై గంజాయి సాగు గుర్తించారు..పూలమొక్కల్లో కలిపి ఈ గంజాయి సాగు చేయడం గమనించారు. అక్కడి నాలుగు కుండీలలో గంజాయినీ గుర్తించారు.
పోలీసులు, యాంటీ డ్రగ్స్ టీమ్ కూడా ఈ గంజాయి పెంపకం చూసి షాక్ అయ్యారు.నిందితుడితో పాటు, ఇంటి యాజమానిని కూడా అరెస్ట్ చేశారు.. మిల్స్ కాలని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు..