Salman Khan

Salman Khan: సల్మాన్ ఖాన్ కు బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి అరెస్ట్ 

Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ ను చంపేస్తానంటూ  బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తిని ముంబై పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ముంబైలోని వర్లీ పోలీసులు అతన్ని జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో అరెస్టు చేశారు. గత వారం, ముంబై ట్రాఫిక్ పోలీసులకు సల్మాన్‌కు సంబంధించి బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో రూ. 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఇప్పుడు జంషెడ్‌పూర్ స్థానిక పోలీసుల సహాయంతో, ఆ మెసేజ్ పంపిన వ్యక్తిని అరెస్టు చేశారు.

Salman Khan: వర్లీ పోలీసుల బృందం అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విచారిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తదుపరి చర్యల కోసం అతడిని ముంబైకి తీసుకురానున్నారు. ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్‌లో బెదిరింపు మెసేజ్ రావడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో జార్ఖండ్‌లోని ఓ నంబర్‌ నుంచి ఈ మెసేజ్ వచ్చినట్లు పోలీసులకు తెలిసింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు పలు బృందాలను జార్ఖండ్‌కు పంపారు.

నిందితుడు కూరగాయల మార్కెట్లో వ్యాపారి.. 

నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు మెసేజ్  పంపిన వ్యక్తి కోసం ముంబై పోలీసులు జార్ఖండ్‌లో ఆ నంబర్‌ను ట్రాక్ చేశారు. నిందితుడు జంషెడ్‌పూర్‌లో కూరగాయలు అమ్ముకునే వ్యక్తి షేక్ హుస్సేన్ షేక్ మౌసిన్‌గా గుర్తించారు. నిందితుడి వయస్సు 24 ఏళ్లు. 

Salman Khan: నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్లాన్ చేశారు. కానీ, ముంబై ట్రాఫిక్ పోలీసులకు అదే మొబైల్ ఫోన్ నంబర్ నుండి క్షమాపణలు వచ్చాయి. నటుడు సల్మాన్ ఖాన్‌కు గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నటుడి బాంద్రా ఇంటి వెలుపల అనుమానిత ముఠా సభ్యులు కాల్పులు జరిపారు.

హత్య కుట్రను పోలీసులు బయటపెట్టారు

సల్మాన్ ఖాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన కుట్రను కొన్ని నెలల క్రితం నవీ ముంబై పోలీసులు బయటపెట్టారు. ఈ ఘటన తర్వాత నటుడి భద్రతను పెంచారు. అదే సమయంలో, సల్మాన్ స్నేహితుడు, NCP (అజిత్) నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ కూడా ముంబైలో బహిరంగంగా హత్య చేయబడ్డాడు.

Salman Khan: కొద్ది రోజుల క్రితం బాబా సిద్ధిఖీని ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చారు.  ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. ఈ కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు కూడా వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *