Mallu Ravi: తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
🔹 వరంగల్ జిల్లా నేతల సమన్వయం కోసం కమిటీ
వరంగల్ జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం కోసం ముగ్గురు సీనియర్ నేతలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే పీసీసీకి లేఖ రాసినట్లు తెలిపారు.
🔹 గజ్వేల్ ఘటనపై విచారణ
గజ్వేల్‌లో నర్సారెడ్డి దాడి చేశారని వచ్చిన ఫిర్యాదుపై కమిటీ వివరాలు సేకరించింది. మంత్రి వివేక్ సమక్షంలో ఈ ఘటన జరిగినందున, దీనిపై నాలుగుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌గా శ్యామ్ మోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కమిటీ పది రోజుల్లో నివేదిక ఇవ్వనుంది.
🔹 రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై దర్యాప్తు
రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా వివరాలు సేకరిస్తున్నట్లు మల్లు రవి తెలిపారు. వీటిపై వచ్చే వారం జరిగే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు.