Mallareddy: రాజకీయాలకు దూరంగా ఉంటానని తాను అనలేదని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తాను సమాధానంగా ఇచ్చిన వివరాలతో తాను రాజకీయాలకే గుడ్‌బై చెప్పనున్నట్టు మీడియా ప్రతినిధులు కొందరు వక్రీకరించారని ఆయన తెలిపారు. తాను అలా అనలేదని తేల్చి చెప్పారు.
Mallareddy: జపాన్‌లో ఏవిధంగా రిటైర్మెంట్ ఉండదో.. తనకు కూడా రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండబోదని మాజీ మంత్రి మల్లారెడ్డి తేల్చి చెప్పారు. మీరు బీజేపీలోకి వెళ్తున్నారా? టీడీపీలోకి వెళ్తున్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తాను సమాధానం ఇచ్చానని తెలిపారు. తనకు 73 ఏళ్ల వయసు ఉన్నదని తాను ఏ పార్టీలోకి వెళ్లబోనని, విద్యాసంస్థలను బలోపేతం చేసి, దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పానని వివరించారు.
Mallareddy: బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టంచేశారు. తాను ఈ దశలో ఏవైపూ చూసేలా లేనని ఆ విలేకరికి చెప్పానని తెలిపారు. వేరే పార్టీలో చేరే అవసరమూ తనకు లేదని చెప్పారు. ఎందుకు వెళ్తానో మీరే చెప్పండి.. అని అక్కడి మీడియా ప్రతినిధులనే ప్రశ్నించారు. విద్యాసంస్థలకు ఎక్కువ సమయం ఇచ్చి, రాజకీయాలకు తక్కువ సమయం ఇచ్చేలా ఉండనున్నట్టు చెప్పానని తెలిపారు.