Malla reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్ — ఏవైపైనా వెళ్లే ఆలోచన లేదని, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
“నా వయసు 73 సంవత్సరాలు. ఈ దశలో ఏవైపు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు అనుభవించాను. ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటాను. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమై, ప్రజాసేవలో మిగిలిన సమయం గడపాలని నిర్ణయించుకున్నాను” అని మల్లారెడ్డి చెప్పారు.
రాజకీయాల తర్వాతి ప్రణాళిక:
రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తూ విద్యా రంగంలో సేవ చేయాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
