ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు 30 అడుగుల వేల పడింది.వివరాల్లోకి వెళితే వైఎస్సార్ జిల్లాలో కదిరి నుంచి బయలుదేరిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో 30 అడుగుల లోయలో పడింది.బస్సులో ఉన్న వారు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.