Telangana Police

Telangana Police: తెలంగాణ పోలీస్‌ శాఖలో పెను మార్పులు: 12 జోన్లుగా మూడు కమిషనరేట్ల విభజన!

Telangana Police: తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ పునర్విభజన జరిగిన నేపథ్యంలో పోలీస్ శాఖలో అత్యంత కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పరిపాలనను మరింత సరళతరం చేయడానికి నేర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేయడానికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ నూతన మార్పుల ప్రకారం మొత్తం 12 పోలీస్ జోన్లను ఏర్పాటు చేశారు. వీటిలో హైదరాబాద్ పరిధిని పెంచుతూ, సైబరాబాద్‌లోని కొన్ని కీలక ప్రాంతాలను ఇందులో కలిపారు.

ఈ పునర్విభజనలో భాగంగా జరిగిన ప్రధాన మార్పు ఏమిటంటే.. గతంలో సైబరాబాద్ పరిధిలో ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, రాజేంద్రనగర్ వంటి కీలక జోన్లు ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోకి వచ్చాయి. దీనివల్ల నగర పోలీసుల బాధ్యతలు మరింత పెరగడమే కాకుండా, విమానాశ్రయ భద్రత నేరుగా సిటీ పోలీస్ పర్యవేక్షణలోకి రానుంది.

1. హైదరాబాద్ కమిషనరేట్ (మొత్తం 6 జోన్లు):
నగర విస్తరణ దృష్ట్యా హైదరాబాద్ కమిషనరేట్‌ను ఆరు జోన్లుగా విభజించారు. అవి:

చార్మినార్ జోన్
గోల్కొండ జోన్
ఖైరతాబాద్ జోన్
సికింద్రాబాద్ జోన్
రాజేంద్రనగర్ జోన్ (కొత్తగా చేరినది)
శంషాబాద్ జోన్ (విమానాశ్రయంతో సహా కొత్తగా చేరినది)

Also Read: Hyderabad: హైద‌రాబాద్‌లో ప్ర‌మాద ఘంటిక‌లు

2. సైబరాబాద్ కమిషనరేట్ (మొత్తం 3 జోన్లు):
ఐటీ, పారిశ్రామిక హబ్‌లను పర్యవేక్షించేందుకు సైబరాబాద్‌లో ఈ మార్పులు చేశారు.

శేరిలింగంపల్లి జోన్: ఇది మొయినాబాద్ నుండి పటాన్‌చెరు వరకు విస్తరించి ఉంటుంది.
కూకట్‌పల్లి జోన్: గతంలో మాదాపూర్‌గా ఉన్న ప్రాంతం ఇప్పుడు ఈ జోన్ కిందకు వస్తుంది.
కుత్బుల్లాపూర్ జోన్: దీనిని ప్రత్యేక జోన్‌గా కొనసాగిస్తున్నారు.

3. రాచకొండ కమిషనరేట్ (మొత్తం 3 జోన్లు):
తూర్పు హైదరాబాద్ పరిసర ప్రాంతాల కోసం వీటిని కేటాయించారు.

ఎల్బీనగర్ జోన్
మల్కాజ్‌గిరి జోన్
ఉప్పల్ జోన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *