Hyderabad: హైదరాబాద్‌లోని కాటేదాన్ పారిశ్రామికవాడలో ఈరోజు మధ్యాహ్నం పెద్దఎత్తున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.
అప్పటివరకు సాధారణంగా ఉన్న పరిస్థితి ఒక్కసారిగ0 మారిపోయింది. మంటలు అదికంచిగా ఎగిసిపడటంతో దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్మేసింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటల ధాటికి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
సౌకర్యవశాత్తు, ఆదివారం కావడంతో గోదాంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు, అగ్నిమాపక అధికారులు దీనిపై దర్యాప్తు చేపట్టరు.
