Amaravati: ఏపీ సచివాలయంలో సున్నితమైన రెండో బ్లాక్ లో శుక్రవారం నాడు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సచివాలయం రెండో బ్లాక్‌లోని బ్యాటరీ ఉంచే ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటనతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. అయితే, పటిష్టమైన ఫైర్ సేఫ్టీ చర్యలతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
సచివాలయంలోని రెండో బ్లాక్‌లో ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి, టూరిజం, దేవాదాయ శాఖ మంత్రులు, హోం మంత్రితో పాటు, ఇతర కీలక మంత్రుల పేషీలు ఉన్నాయి. దీంతో ఈ అగ్నిప్రమాదం జరగడం టెన్షన్ వాతావారణం సృష్టించింది. ఈ అగ్నిప్రమాద కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో అందరూ అప్రమత్తమయ్యారు. ప్రమాదం ఎందుకు జరిగింది అనే కోణంలో ప్రధానంగా అధికారులు దృష్టి సారించారు.
Amaravati: సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది వేగంగా స్పందించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. వేగంగా మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్త పడగలిగారు.
Also Read: Manoj Kumar: సీనియర్ హిందీ నటుడు మనోజ్ కుమార్ కన్నుమూత
తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో అక్కడ సిబ్బంది ఎవరూ లేరని తెలుస్తోంది. రెండో బ్లాక్ లో ఉండాల్సిన కొద్దిమంది సిబ్బంది కూడా ఆ సమయంలో అక్కడ లేరని తెలుస్తోంది. తెల్లవారుజామునే ఈ ఘటన జరగడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బందికి మంటలను పెద్దగా ఇబ్బందులు లేకుండా అదుపు చేయడం సులువుగా మారింది.
Amaravati: ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. సచివాలయంలో ఇలా జరగడంతో అందరూ అప్రమత్తమయ్యారు. దీనివెనుక కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇందులో ఏదైనా ఉద్దేశ్యపూర్వక చర్య గురించి సమాచారం తెలిస్తే వెంటన్ కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సచివాలయంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని అందరూ భావిస్తున్నారు.

