Encounter

Encounter: మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్

Encounter: మావోయిస్టుల కదలికలకు సంబంధించి పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల సమీపంలో, మారేడుమిల్లిలోని లోతట్టు అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్‌ చేపట్టాయి.

మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. సుదీర్ఘంగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక మావోయిస్టు అగ్రనేత కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: Sheikh Hasina: హసీనాకు మరణశిక్ష.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరికొందరు మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయి ఉండవచ్చనే అనుమానంతో పోలీసులు ఆ ప్రాంతమంతా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఈ భారీ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన అధికారిక, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని, సంఘటన స్థలం నుంచి ఆయుధాలు, ఇతర సామాగ్రిని సేకరించే పనిలో భద్రతా బలగాలు నిమగ్నమై ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *