MAJOR DONATIONS TO TTD

TTD: రూ.2.93 కోట్లు.. టీటీడీకి భారీ విరాళాలు

TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థలు కోట్ల రూపాయల విరాళాలు అందించాయి. ఆదివారం ఆర్‌ఎస్‌బీ రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ రూ.2,92,91,840 (రూ.2.93 కోట్లు)ను టీటీడీ బర్డ్ ట్రస్టుకు అందించింది. అదే విధంగా ఆర్‌ఎస్ బ్రదర్స్ జ్యూవెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1.10 కోట్లు విరాళంగా సమర్పించింది.

ఈ సందర్భంగా ఆ సంస్థల ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, సీర్న రాజమౌళి, టి.ప్రసాద్‌రావు, పొట్టి మాలతి లక్ష్మీ కుమారిలు కలిసి తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరిలకు విరాళాల చెక్కులను అందజేశారు.

ఇది కూడా చదవండి: PM Modi China Visit: జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ..వాటిపైనే కీలక చర్చ

అంతేకాక, నర్సారావుపేటకు చెందిన భక్తుడు జె. రామాంజనేయులు శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా సమర్పించారు.

టీటీడీ అధికారులు ఈ విరాళాలను స్వీకరించి భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విరాళాల ద్వారా తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *